సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం 1,554 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా మొత్తంగా రాష్ట్రంలో 49,259కు కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రికవరీ అయిన కేసులు 37,666 కేసులు నమోదయ్యాయి. తాజాగా 9 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 429 మరణాలు సంభవించాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ 842 కేసులు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 132, మేడ్చల్ 96, సంగారెడ్డి 24, ఖమ్మం 22, కామారెడ్డి 22, వరంగల్ అర్బన్ 38, వరంగల్ రూరల్ 36, కరీంనగర్ 73, మహబూబాబాద్ 11, పెద్దపల్లి 23, మెదక్ 25, మహబూబ్ నగర్ 14, నల్లగొండ 51, రాజన్న సిరిసిల్ల 18, నాగర్కర్నూల్ 14, నిజామాబాద్ 28, వనపర్తి 21, సూర్యాపేట 22 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
- July 22, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- GHMC
- HEALTHBULLETIN
- TELANGANA
- కరోనా కేసులు
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on 1,554 కేసులు.. 9 మరణాలు