Breaking News

హైదరాబాద్..​ ఎవడబ్బ జాగీరు కాదు!

సారథిన్యూస్​, హైదరాబాద్​: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్​లోని అల్వాల్​లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాతబస్తీలో కొందరు బీజేపీ మద్దతుదారులను, హిందువులను ఇబ్బంది పెడుతున్నారని అటువంటి వారి చేతులు నరికేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను భారతీయ జనతాపార్టీ కాపాడుకుందని చెప్పారు. హైదరాబాద్​ ఎవడబ్బ జాగీరు కాదు అంటూ మండిపడ్డారు. త్వరలో జరుగబోయే జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించే అంశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకులెవరూ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇక ఇదే సందర్భంలో కొన్ని మీడియా సంస్థల తీరుపైనా బండి సంజయ్ విరుచుకుపడ్డారు. కొన్ని పత్రికలు అధికార పార్టీకి భజన చేస్తున్నాయని వారు రాసే వార్తలను చదివి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. బండి సంజయ్​ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.