సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లో కంటైన్మెంట్ జోన్ల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 92 యాక్టివ్ కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా తెలిపింది. హైదరాబాద్‌లో కంటైన్మెంట్ జోన్ల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 92 యాక్టివ్ కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా తెలిపింది. చార్మినార్ జోన్‌లో అత్యధికంగా 31 ఉండగా.. సికింద్రాబాద్‌లో 23, ఖైరతాబాద్‌లో 14, శేరిలింగంపల్లిలో 10, కూకట్‌పల్లిలో 9, ఎల్బీ నగర్‌లో 5 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయని తెలిపింది. ఇక చార్మినార్ జోన్‌లోని చాంద్రాయణగుట్ట సర్కిల్‌లో అత్యధికంగా 9 కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు తెలిపింది. అలాగే మే నెలలో కరోనా హాట్‌స్పాట్‌గా మారిన మలక్‌పేట సర్కిల్‌లో ప్రస్తుతం 6 కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు వెల్లడించారు. కాగా తెలంగాణలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 57,142కు చేరింది. వీరిలో 42,909 మంది కరోనా నుంచి కోలుకోగా.. 13,753 మంది చికిత్సపొందుతున్నారు. కరోనా సోకి తెలంగాణలో 830 మంది మృతి చెందారు.
- July 28, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- హైదరాబాద్
- CONTAIMENT ZONES
- COVID
- HYDERABAD
- కంటోన్మెంట్ జోన్స్
- కోవిడ్
- హైదరాబాద్
- Comments Off on హైదరాబాద్‌లో కంటైన్మెంట్ జోన్లు ఎన్నంటే