సారథిన్యూస్, రామాయంపేట: తెలంగాణ ప్రభుత్వం పరిశుభ్రతకే అధిక ప్రాధాన్యమిస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా నిజాంపేట మండలకేంద్రంతోపాటు మండలపరిధిలోని నస్కల్, రాంపూర్, నందగోకుల్, చల్మేడ గ్రామాలలో డంప్ యార్డ్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ వైరస్ ను తరిమి కొట్టాలంటే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అందే ఇందిరా, జెడ్పీటీసీ విజయ్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, రమాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరఫ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
- July 13, 2020
- Archive
- Top News
- KARIMNAGR
- RAMAYAMPET
- TELANGANA
- TRS
- మెదక్
- రాంపూర్
- Comments Off on స్వచ్ఛతకే ప్రాధాన్యం