పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ తర్వాత జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. వరుస ప్రాజెక్ట్స్అనౌన్స్చేసి సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఇందులో రెండు రీమేకులే కావడం విశేషం. ప్రస్తుతం వేణుశ్రీరామ్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘వకీల్ సాబ్’.. బాలీవుడ్ సూపర్ హిట్ ‘పింక్’కి రీమేక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో రానున్న చిత్రం మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కి రీమేక్. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఇద్దరికీ సమానమైన ప్రత్యేకత ఉంటుంది.
మాతృకలో పృథ్వీరాజ్, బిజుమీనన్ ఆ పాత్రల్లో నటించారు. బిజు పాత్రలో పవన్ కనిపించనున్నాడు. పృథ్వీ పాత్రకు రానా, నితిన్ లాంటి యంగ్ హీరోల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే పవర్ స్టార్‌డమ్‌ను దృష్టిలో ఉంచుకుని, సెకెండ్ హీరో రోల్‌ను బాగా తగ్గిస్తున్నారని, అలా చేయమని పవనే స్వయంగా చెప్పాడని పుకార్లు వినిపించాయి. దీనిపై దర్శకుడు సాగర్ చంద్ర సినిమాను మన నేటివిటీకి తగ్గట్టు మారుస్తున్న మాట నిజమేనని, కానీ హీరోల పాత్రల్లో మార్పులు చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ‘ఈ సినిమాలోని హీరోల పాత్రలను చాలా అందంగా డిజైన్ చేశారు. వాటి సోల్ చెడిపోకుండా చూసుకుంటూనే మన నేటివిటీకి తగ్గట్టు స్క్రిప్టులో చేంజెస్ చేస్తున్నాం. అంతే తప్ప ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అంటూ పాత్రల నిడివిని తగ్గించడమనేది నిజం కాదు’ అంటూ తేల్చిచెప్పాడు సాగర్ చంద్ర.