సారథి న్యూస్, రామడుగు: రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలంటే సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలని రామడుగు ఎంపీపీ కె.కవిత సూచించారు. మంగళవారం రామడుగు మండలం శనగర్ లో ఆత్మ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వరి, పత్తిలో చీడపీడల నివారణపై పలువరు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చొప్పదండి ఏడీఏ రామారావు, మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, జడ్ఆర్ఎస్ఎస్ మెంబర్ గర్రెపల్లి కర్ణాకర్, వీడీసీ చైర్మన్ కర్ణాకర్, ఉపసర్పంచ్ వెంకట్ నర్సయ్య, ఆత్మ బీటీఎం స్రవంతి, సుమాంజలి, ఏఈవో సంపత్ పాల్గొన్నారు.
- September 22, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- AGRICULTURE
- Farmers
- HYDERABAD
- KARIMNAGAR
- KCR
- KTR
- TELANGANA
- కేటీఆర్
- కేసీఆర్
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on సేంద్రియం.. లాభదాయం