Breaking News

సూటయ్యే సబ్జెక్టుతో..

చాలారోజుల తర్వాత ‘గరుడవేగ’, ‘కల్కి’ సినిమాలతో మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు హీరో రాజశేఖర్. మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ‘షో’, ‘మిస్సమ్మ’, ‘విరోధి’ వంటి సినిమాలను తెరకెక్కించిన నీలకంఠ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందనుందట. యముడికి మొగుడు, ఈడు గోల్డెహె సినిమాల్లో నటించిన రిచా పనాయ్ ని హీరోయిన్ గా సెలక్షన్ కూడా అయిపోయిందట. డిఫరెంట్ కాన్సెప్టులను ఎంచుకునే రాజశేఖర్ స్టైల్ కి ఇది సూటయ్యే కాన్సెప్ట్ అని.. యాక్షన్ ఎంటర్ టైనర్​ గా రూపొందే ఈ మూవీ మలయాళ సినిమా ‘జోసెఫ్’ కు రీమేక్ అంటూ ప్రచారం సాగుతోంది.

అదే నిజమైతే ఆర్గాన్ ట్రాన్సప్లాంటేషన్ లో జరిగే అవకతవకలను వెలికితీసే ప్రయత్నం చేస్తాడు హీరో. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో పోలీస్ ఆఫీసర్​గా అద్భుతమైన పెర్ఫామెన్స్ చేశాడు. తాను నటిస్తూ నిర్మించి, నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు జార్జ్. కన్నకూతురి డెత వెనకాల జరిగిన ఘోరమైన నేరాన్ని నిరూపించే ప్రయత్నంలో తను కూడా ప్రాణాలను ఫణంగా పెడతాడు. ప్రేమ, పెళ్లి, విచారణ ఒకదానికొకటి సంబంధం లేని కథతో ఆసక్తి కలిగించే కథనంతో అక్కడి ఆడియన్స్​ను ఎంతగానో ఆకట్టుకుంది ఈ మూవీ. అయితే జార్జ్ పాత్రనే రాజ శేఖర్ పోషించనున్నారని, తన సొంత బ్యానర్​లోనే నిర్మించనున్నారని సమాచారం.