Breaking News

సుశాంత్​తో డేటింగ్​ చేశా, సిగరెట్​ అలవాటుంది కానీ..

డ్రగ్స్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్​ నటి సారా అలీఖాన్​ను నార్కోటిక్స్​ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) విచారించింది. అయితే సారా అధికారులకు సంచలన నిజాలు చెప్పినట్టు సమాచారం. తాను సుశాంత్​తో కొంతకాలం ప్రేమలో ఉన్నమాట వాస్తవమేనని.. తాము ఇద్దరం కలిసి థాయిలాండ్​ కూడా వెళ్లామని ఆమె చెప్పారట.

‘సుశాంత్​ డ్రగ్స్ తీసుకొనేవాడు. నేను సిగరెట్లు తాగేదాన్ని కానీ డ్రగ్స్​ మాత్రం అలవాటు లేదు’ అని ఆమె తన వాంగూల్మంలో చెప్పారట. అయితే ఈ కేసులో ఇప్పటికే సారాతో పాటు దీపిక పదుకొణే, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ సిమోనీ ఖంబట్టా, దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌లను ఎన్‌సీబీ ప్రశ్నించింది. కాగా రకుల్​ ప్రీత్​ సింగ్​ ఇంట్లో భారీ మొత్తంలో డ్రగ్స్​ పట్టుబడ్డట్టు సమాచారం.