సారథి న్యూస్, రామడుగు: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడక్కడా ఎమ్మెల్యేలు, లీడర్లు వచ్చే వరకు పంపిణీ ప్రారంభించడం లేదు. దీంతో మహిళలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తున్నది. శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చీరల పంపిణీ చేపట్టారు. ఉదయం 10గంటలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉండగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మధ్యాహ్నం 12 గంటలైనా రాక పోవటంతో పంపిణీ కార్యక్రమం ఆలస్యమైంది. దీంతో మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, జెడ్పీ కో -ఆప్షన్ సభ్యుడు సుక్రోద్దీన్, తహసీల్దార్ కోమల్ రెడ్డి, ఎంపీడీవో మల్హోత్రా, ఎంపీవో సతీశ్రావు వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
- October 10, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- ANDHRAPRADESH
- HYDERABAD
- KARIMNAGAR
- TELANGANA
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ
- తెలంగాణ
- హథ్రాస్
- హైదరాబాద్
- Comments Off on సార్లు.. ఎంతసేపు ఎదురుచూడాలె!