సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రూ.1.8 కోట్ల వ్యయంతో నిర్మించిన సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోమవారం ప్రారంభించారు. రెండు అంతస్తుల్లో నిర్మించిన భవనంలో వసతులు బాగున్నాయని కితాబిచ్చారు. సత్వర సేవలు అందించి జిల్లాలోనే నంబర్వన్ట్రెజరీగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 76 సబ్ ట్రెజరీ భవనాలకు ఒకేసారి నిర్మాణ అనుమతులు వస్తే నరసన్నపేటలో భవనం మొదటిసారిగా ప్రారంభానికి నోచుకోవడం గొప్ప విషయమని అన్నారు. అంతకుముందు ఆయన పూజలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు.
- November 16, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- శ్రీకాకుళం
- ANDRAPRADESH
- AP CM JAGAN
- DARMANA KRISHNADAS
- SRIKAKULAM
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ సీఎం జగన్
- ధర్మాన కృష్ణదాస్
- శ్రీకాకుళం
- సబ్‌ట్రెజరీ
- Comments Off on సబ్ ట్రెజరీ ద్వారా సత్వర సేవలు