Breaking News

సజావుగా సచివాలయ పరీక్షలు

సజావుగా సచివాలయ పరీక్షలు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి చేపట్టిన రాత పరీక్షలు తొలిరోజు విజయవంతంగా ముగిశాయిని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం కర్నూలు నగరంలోని విద్యానగర్ మాంటిస్సోరి హైస్కూలు, ఎన్ఆర్ పేట సెయింట్ ​జోసఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూలు ఎగ్జామ్​ సెంటర్​ను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 127 పరీక్ష కేంద్రాల్లో మొదటి రోజు ఉదయం జరిగిన పరీక్షకు 76.77 శాతం మంది హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షకు 34,367 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 26,382 మంది రాశారని పేర్కొన్నారు. ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, జేసీ(రెవెన్యూ) రవి పట్టన్ షెట్టి, జేసీ(సంక్షేమం) సయ్యద్ ఖాజా మొహిద్దీన్, కర్నూలు మున్సిపల్​కమిషనర్ డీకే బాలాజీ, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి, జడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య, స్టేట్ స్పెషల్ ఆఫీసర్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.