సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. లాక్డౌన్ అనంతరం ఈ మూవీ షూటింగ్ తిరిగి స్టార్ట్ అయింది. లాక్ డౌన్‌కి ముందే చాలా వరకూ షూటింగ్ అయిపోయింది. దాంతో పదిరోజుల్లోనే బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేశారు. షూటింగ్ పూర్తయిన విషయాన్ని శుక్రవారం సోషల్ మీడియా ద్వారా టీమ్ కన్ఫర్మ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోని ట్వీట్ చేశారు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దీనికి నిర్మాత. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నభా నటేష్ హీరోయిన్. టీజర్‌తో పాటు థమన్ సంగీతం అందించిన పాటలు విడుదల కావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. అన్ని రకాల జాగ్రత్తలతో, ఎలాంటి డల్ మూమెంట్స్ లేకుండా ఎంతో సరదాగా షూటింగ్ జరిగిందని తేజ్ ట్వీట్ చేశాడు. చిత్ర లహరి, ప్రతిరోజూ పండగే చిత్రాలతో తిరిగి సక్సెస్ ట్రాక్ పైకి వచ్చిన తేజ్.. ఈ సినిమాతో తనకు మరో సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.