టీవీనటి శ్రావణి ఆత్మహత్యకేసు ఓ కొలిక్కివచ్చినట్టు సమాచారం. ఈ కేసులో ఎస్ఆర్నగర్ పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. ఈ కేసులో మెదటి నుంచి శ్రావణి టిక్‌టాక్ ఫ్రెండ్ దేవరాజ్‌రెడ్డి, ఫ్యామిలీ ఫ్రెండ్ సాయికృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డి కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రావణి కుటుంబం ఎస్ఆర్నగర్ పరిధిలోని మధురానగర్‌లో ఉంటున్నది. వీరి కుటుంబానికి సాయికృష్ణారెడ్డి మొదట పరిచయం అయ్యాడు. అతడు శ్రావణికి పలు సినిమాల్లో అవకాశం ఇప్పించాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే శ్రావణికి టిక్‌టాక్‌లో దేవ్‌రాజ్‌రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికూడా చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి వివాహానికి సాయికృష్ణారెడ్డితోపాటు శ్రావణి కుటుంబసభ్యులు కూడా అడ్డుపడ్డారు. అంతేకాక గతంలో శ్రావణిపై ఒత్తిడి తీసుకొచ్చి దేవ్రాజ్పై కేసుకూడా పెట్టించారు. అయినప్పటికీ శ్రావణి.. దేవరాజ్‌నే ఇష్టపడుతోంది. ఈ క్రమంలో శ్రావణి ఇంట్లో గొడవలు చెలరేగాయి. మరోవైపు దేవరాజ్ కూడా శ్రావణిని పెళ్లిచేసుకొనేందుకు నిరాకరించడంతో తీవ్ర నిరాశకు లోనేన శ్రావణి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఈ కేసును ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తైతే పూర్తివివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుతం సాయికృష్ణారెడ్డి, దేవరాజ్‌రెడ్డి పోలీసుల అదుపులో ఉండగా ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
- September 14, 2020
- Archive
- Top News
- క్రైమ్
- సినిమా
- HYDERABAD
- MOVIES
- SERIALS
- SHRAVANI
- SRNAGAR
- TVSHOW
- ఎస్ఆర్నగర్
- శ్రావణి
- హైదరాబాద్
- Comments Off on శ్రావణి కేసులో షాకింగ్ నిజాలు!