సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్ డివిజన్లో శుక్రవారం మధ్యాహ్నం ముస్లిం మతపెద్దలను తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆప్యాయంగా పలకరించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాలిని గీతాప్రవీణ్ ముదిరాజ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హిందూ.. ముస్లిం భాయ్ భాయ్ గా కలిసిపోయి గంగా.. జమున తాహజిబ్ సంస్కృతిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాపాడుతున్నారని కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు కొనసాగే విధంగా మద్దతు పలకాలని కోరారు.
- November 27, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ముఖ్యమైన వార్తలు
- హైదరాబాద్
- CM KCR
- GHMC ELECTIONS
- HYDERABAD
- TRS PARTY
- జీహెచ్ఎంసీ ఎన్నికలు
- టీఆర్ఎస్
- బీజేపీ
- సీఎం కేసీఆర్
- హైదరాబాద్
- Comments Off on శాంతిభద్రతలను కాపాడుకుందాం