Breaking News

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ, స్థానిక ఆర్డీవో కార్యాలయల్లో బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అధికారంలో ఉండి కూడా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి భయపడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, వేణు, వేణుగోపాల్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు

అక్కన్నపేటలో బీజేపీ నేతల అరెస్టు
అక్కన్నపేట తహసీల్దార్ ఆఫీసు ఎదుట జాతీయ జెండాను ఎగరవేసేందుకు వచ్చిన బీజేపీ మండలాధ్యక్షుడు వీరాచారి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు నూనవత్ మోహన్ నాయక్, రాజుకుమార్, కార్తీక్, సాగర్, కళ్యాణ్, విష్ణు, కృష్ణ, అనిల్ ను పోలీసులు అరెస్ట్​చేసి స్టేషన్ కు తరలించారు.