Breaking News

విదేశాల నుంచి వస్తే క్వారంటైన్ తప్పనిసరి

విదేశాల నుంచి వస్తే క్వారంటైన్ తప్పనిసరి

సారథి న్యూస్, ములుగు: కరోనా సెకండ్​ వేవ్​ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారిని 15 రోజుల వరకు క్వారంటైన్​లో ఉంచాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణాఆదిత్య సూచించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ములుగు, భూపాలపల్లి జిల్లాల వైద్యాశాఖ అధికారులతో కోవిడ్ -19 వాక్సిన్ పై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. పీహెచ్​సీల్లో కరోనా వ్యాక్సిన్​ను భద్రపరిచేందుకు ఉన్న అవకాశాలపై ఆరాతీశారు. వ్యాక్సిన్​ను ముందుగా ఎవరి ఇవ్వాలో సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఐదేళ్లలోపు పిల్లలు 21,172 ఉన్నారని, వారికి వ్యాక్సినేషన్​ కోసం 312 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఆదర్శ సురభి, ములుగు ఆర్డీవో రమాదేవి, డాక్టర్​శ్యాం, ప్రోగ్రాం ఆఫీసర్ రాజకుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.