సారథి న్యూస్ చొప్పదండి: బతుకుదెరువులేక దుబాయ్ వెళ్లిన ఓ కార్మికుడి జీవితం అత్యంత విషాదంగా ముగిసింది. కరోనా లక్షణాలతో అతడు ప్రాణాలు కోల్పోగా అయినవాళ్లేవరూ లేకుండానే అంతిమ సంస్కారాలు జరుపవలసిన పరిస్థితి నెలకొన్నది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రానికి చెందిన క్యాదాసు కొండయ్య కొన్నేండ్ల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. కరోనాతో బాధపడుతూ 10 రోజుల క్రితం అబుదాబి క్యాంప్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం కుటుంబ సభ్యులు చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లగా అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి తన వంతు సాయం చేశాడు. కానీ కరోనా లక్షణాలున్న మృతదేహం ఇండియా పంపించడం కుదరదని అక్కడి అధికారులు తేల్చిచెప్పారు. దీంతో కొన్ని స్వచ్చందసంస్థల సహకారంతో గురువారం అబుదాబిలోని భనియస్ శ్మశానవాటికలో అతడి అన్న కుమారుడు నాగరాజు సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.
- June 27, 2020
- Archive
- తెలంగాణ
- KARIMNAGAR
- LABOUR
- MIGRATE LABIUR
- MLA SUNKE
- TELANGANA
- అంత్యక్రియలు
- వలసజీవి
- Comments Off on ‘వలసజీవి’తం.. విషాదాంతం