సారథిన్యూస్, అమరావతి: జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్సీపీ గుండాలు తనను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. వాళ్ల బెదిరింపులకు తాను బెదిరిపోయే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తనకు రోజుకు 10 సార్లు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీతో తొక్కించి చంపుతామని బెదిరించినట్లు ఉమ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే వైసీపీ మంత్రులు బెదిరిస్తున్నారని చెప్పారు. తనకు బెదిరింపు కాల్స్ చేయడం వెనక కొడాలి నాని పాత్ర ఉందని ఆరోపించారు. ఈఘటనపై ఏపీ పోలీసులపై నమ్మకం లేదని.. సీబీఐ ఎంక్వైరీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
- September 12, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- AMARAVATHI
- DEVINENI
- HYDERABAD
- LORRY
- TDP
- UMA
- అమరావతి
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ
- దేవినేని ఉమ
- హైదరాబాద్
- Comments Off on లారీతో తొక్కించి చంపుతామంటున్నారు