సారథి న్యూస్, మానవపాడు: ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయి రైతులు బాధపడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. శనివారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పర్యటించి పంటలను పరిశీలించారు. మానవపాడు మండలం మానవపాడు, అమరవాయి గ్రామాల్లో పంటలను పరిశీలించారు. పత్తి, మిరప పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని.. అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపించారు. ఆయన వెంట మనోపాడ్ ఎంపీపీ అశోక్ కుమార్ రెడ్డి , కాంగ్రెస్ గోపాల్ రెడ్డి, నేతాజీ గౌడ్ పచర్ల కుమార్, జగన్మోహన్ నాయుడు తదితరులు ఉన్నారు.
- October 3, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- FARMING
- HYDERABAD
- KCR
- KTR
- TELANGANA
- ఆంధ్రప్రదేశ్
- కేసీఆర్
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on రైతన్నల ఆక్రందనలు వినిపించవా?