వైసీపీ రెబల్ ఎంపీ, నిత్యం ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్పై విరుచుకుపడే రఘురామకృష్ణంరాజుకు తొలిసారి షాక్ తగిలింది. ఆయన ఇండ్లు, కంపెనీలు, ఆఫీసుల్లో గురువారం సీబీఐ సోదాలు నిర్వహించి కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు… రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇందు, భారత్ కంపెనీ తో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ ల ఇళ్లలో సోదాలు చేసింది. ఉదయం ఆరు గంటలనుండి సోదాలు జరుగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 11 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. వివిధ బ్యాంకుల నుంచి ఎంపీ రఘురామకృష్ణం రాజు రూ. 826 కోట్లు రుణం తీసుకొని చెల్లించడం లేదని సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయన భారీమొత్తంలో రుణం తీసుకున్నట్టు టాక్. అయితే బ్యాంక్ ఫ్రాడ్ వ్యవహరంలో రఘురామకృష్ణం రాజుతో పాటు ఆయన భార్య, కూతురు పేర్లు కూడా ఉన్నట్టు సమాచారం