సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు చివరికి రియా చక్రవర్తి మెడకు చుట్టుకుంటున్నది. ఈ కేసులో తాజాగా డ్రగ్స్ కోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. రియా డ్రగ్స్ కొనుగోలు చేసి.. సుశాంత్‌కు అందించినట్టు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. రియా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు సీబీఐకి కీలక ఆధారాలు దొరికాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటికే సుశాంత్ మేనేజర్ శామ్యూల్, రియా సోదరుడు షోవిక్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఆదివారం రియాను కూడా అదుపులోకి తీసుకొని విచారించనున్నట్టు సమాచారం. విచారణకు హాజరుకావాల్సిందిగా రియాకు కూడా ఎన్‌సీబీ నుంచి సమన్లు అందాయి. రియాతో పాటు మరికొందరిని కూడా విచారణకు పిలవబోతున్నట్టు ఎన్‌సీబీ డిప్యూటీ డీజీ అశోక్ జైన్ తెలిపారు.