Breaking News

రాష్ట్రాల హక్కులపై కేంద్రం పెత్తనమా?

సారథి న్యూస్, రామడుగు: రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తున్నది ఈ పద్ధతి సరికాదని కాంగ్రెస్​ పార్టీ ఎస్సీ సెల్​ రాష్ట్ర కన్వీనర్​ రాజమల్లయ్య మండిపడ్డారు. శనివారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగులో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుండగా.. మరోవైపు చైనా దురాక్రమణ పాల్పడుతున్నదని ఇటువంటి సమస్యలపై కేంద్రప్రభుత్వం దృష్టిపెట్టకుండా రాష్ట్రాల హక్కులను హరించేందుకు కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు.