రవితేజ నటించిన ఇడియట్ చిత్రంలోని ‘చూపుల్తో గుచ్చి, గుచ్చి చంపకే’ అనే పాటను తెలియని సంగీత ప్రియులు ఉండరంటే అతీశయోక్తి కాదేమో. అయితే ఈ పాటను ఓ బాలీవడ్ మ్యూజిక్ డైరెక్టర్ కాపీ కొట్టాడు. ట్యూన్‌ను యాజ్ ఇ టీజ్‌గా దించేశాడు. ఆ పాటలో నటించింది మరెవరో కాదు.. కియారా అద్వాని. ఈ అమ్మడు ఇప్పటికే ‘భరత్అనే నేను’ ‘వినయవిధేయరామ’ చిత్రంలో నటించి మెప్పించింది. కియారా ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘ఇందూకి జవానీ’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాను అభీర్‌సేన్ గుప్తా డైరెక్ట్ చేస్తున్నారు. మికా సింగ్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ బుధవారం ఓ పాటను విడుదల చేసింది. ‘హసీనా పాగల్ దివాని’ అంటూ సాగే సాంగ్‌లో కైరాతో పాటు ఆదిత్య సియల్ కనిపిస్తున్నారు. టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ అయిన విడుదలేన ఈ పాట .. మన తెలుగుపాటకు కాపీ కావడం గమనార్హం. ఏంటి మన తెలుగు పాటలను కూడా బాలీవుడ్ టెక్నిషియన్స్ కాపీ చేస్తున్నారా.. అంటూ కామెంట్లు పెడతున్నారు నెటజన్లు.
‘Idiot’ song itself is a copy to Mika Singh’s 1998 hit “Sawan mein lag gayi aag”.
https://www.youtube.com/watch?v=B4EL3xbHe-4