సారథి న్యూస్, రామడుగు: మోతె రిజర్వాయర్‌కు ఎట్టకేలకు అనుమతి లభించింది. పనులు వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో నిర్మిస్తున్న మోతె రిజర్వాయర్‌కు గతేడాది జూన్‌లో టెండర్లు పిలిచారు. త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు. రూ.180కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. రామడుగు, గంగాధర చొప్పదండి మండలాల్లో దాదాపు 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే రవిశంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.
- August 13, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHOPPADANDI
- HYDERABAD
- KARIMNAGAR
- KCR
- MLA
- PROJECT
- RAVISHANKAR
- TELANGANA
- చొప్పదండి
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on మోతె రిజర్వాయర్‌కు మోక్షం