సారథి న్యూస్, హైదరాబాద్: మహిళా సాధిరాకత, స్వయం సమృద్ధే లక్ష్యంగా పేద మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫుడ్ప్రాసెసింగ్యూనిట్లపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాజేంద్రనగర్, టీఎస్ ఐపార్డ్ లో గురువారం నిర్వహించిన వర్క్‌షాపునకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్పీ వంటి అనేకానేక ప్రాజెక్టులతో జలవిప్లవం వచ్చిందన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో ఇప్పటికే 65,362 మహిళా రైతులతో 14,131 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశామన్నారు. 9 జిల్లాల్లో యాక్టివ్ గా పనిచేస్తున్న రైతు మహిళా ఉత్పత్తి సంఘాలతో సంఘాలతో రాష్ట్ర సమాఖ్యను ఏర్పాటు చేస్తామన్నారు.
- September 3, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ERRABELLI
- TELANAGANA
- WOMENEMPOWERMENT
- ఎర్రబెల్లి
- తెలంగాణ
- మహిళా సాధికారత
- Comments Off on మహిళాసాధికారతే ప్రభుత్వ ధ్యేయం