సారథిన్యూస్, గంగాధర/రామడుగు/రామగుండం: భావితరాలు బాగుండాన్న ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా మంగపేట గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. రామడుగు మండలం గోపాల్రావుపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయము ఆవరణలో పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ అధికారులు, సిబ్బందితో కల్సి పండ్ల మొక్కలను నాటారు. ఆయా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కర్ర శ్యామసుందర్ రెడ్డి, సభ్యులు చడా రాజిరెడ్డి గోలి మధుసుదన్ రెడ్డి, ముదుగంటి రాజిరెడ్డి, సత్యం, మల్లారెడ్డి తిరుపతి, పెద్దపల్లి డీసీపీ రవీందర్, డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజీవ్ గోదావరిఖని, ఏసీపీ ఉమేందర్, రామగుండం సీఐ కర్ణాకర్ రావు, సీసీఎస్ ఇన్సెప్టర్ వెంకటేశ్వర్లు, సీపీవో ఏవో ఫర్హానా, ఆర్ఐలు మధుకర్, శ్రీధర్, ఎన్టీపీసీ ఎస్సై ఉమాసాగర్, ఆర్ ఎస్సై సంతోష్, సీహెచ్ పురుషోత్తం, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
- June 27, 2020
- Archive
- కరీంనగర్
- HARITHAHARAM
- HYDERABAD
- KARIMNAGAR
- KCR
- PEDDAPALLY
- చొప్పదండి
- రామగుండం
- Comments Off on భావితరాల కోసమే హరితహారం