ఆయనో ఉన్నత స్థానంలో ఉన్న పోలీస్ అధికారి.. డీజీ స్థాయి కొలువు చేస్తున్నాడు. కానీ బుద్ధి మాత్రం బాగాలేదు. భార్య ఉండగానే మరో మహిళను ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెతో సరసాలు ఆడుతుంటే భార్య గమనించి నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన సదరు అధికారి భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దృశ్యాలను కన్న కొడుకు ఫోన్లో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్చేశాడు. ఈ వీడియో వైరల్గా మారింది. స్పందించిన ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. పురుషోత్తం శర్మ మధ్యప్రదేశ్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) గా పనిచేస్తున్నాడు. అయితే ఆయన తన భార్యను కొడుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పురుషోత్తం శర్మ ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
‘ఆయన వేరే మహిళతో మా ఇంటిని తీసుకొచ్చాడు. నా ముందే ఆమెతో సరసాలు మొదలు పెట్టాడు. ఇందేటని ప్రశ్నించినందుకు నన్ను తీవ్రంగా కొట్టాడు’ అంటూ భార్య ఆరోపించారు. అయితే ఈ ఘటనపై పురుషోత్తం శర్మ మాట్లాడుతూ.. ‘నేనేమి నేరస్థుడిని కాదు. ఇది మా కుటుంబ గొడవ. 32 ఏళ్ల క్రితం వివాహమైంది. 2008లో కూడా ఓ సారి నా భార్య నాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదంతా మరికొన్న రోజుల్లోనే సర్దుకుంటుంది’ అంటూ వివరణ ఇచ్చాడు.