‘బెస్ట్ ఎనిమీస్’లో సచిన్, సెహ్వాగ్, కోహ్లీ
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు బెస్ట్ ఎలెవన్ టీమ్‌లను ఎంపిక చేస్తే.. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ మైక్ హస్సీ మాత్రం టెస్ట్ క్రికెట్‌లో.. ‘బెస్ట్ ఎనిమీస్ ఎలెవన్’ టీమ్ ను ప్రకటించాడు. ఇందులో లెజెండరీ సచిన్, సెహ్వాగ్‌తో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు కల్పించాడు. కెరీర్‌లో తాను ఆడిన అపోజిషన్ టీమ్ ల్లో నుంచి అత్యుత్తమ ప్లేయర్లను ఎంపిక చేశాడు.
ఓపెనర్లుగా గ్రేమ్ స్మిత్, సెహ్వాగ్, మిడిలార్డర్ లో బ్రియాన్ లారా, సచిన్, కోహ్లీ, కలిస్, సంగక్కరకు స్థానం కల్పించాడు. బౌలర్లుగా డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్ (సౌతాఫ్రికా), జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్), ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)ను తీసుకున్నాడు. అయితే చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ మెట్ అయిన ధోనీకి స్థానం కల్పించకపోవడంపై హస్సీ స్పష్టత ఇచ్చాడు.
టెస్ట్ ఫార్మాట్‌లో మహీ కంటే సంగక్కర ఎక్కువ ప్రభావం చూపాడని తెలిపాడు. ‘సంగక్కర, ధోనీ, డివిలియర్స్ మధ్య పోటీ వచ్చినప్పుడు నేను సంగాకే ఓటు వేశా. అయితే వన్డే, టీ20లకు వచ్చేసరికి మహీ, ఏబీ మరింత మెరుగ్గా ఆడారు’ అని హస్సీ వివరించాడు.