బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ
మెల్ బోర్న్: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్తో ఇంటికే పరిమితమైన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సామాజిక మధ్యమాల్లో చురుకుగా ఉంటున్నాడు. అనుకోకుండా వచ్చిన ఈ బ్రేక్ తో తనలోని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. టిక్ టాక్ లో తరచూ ఏదో ఓ వీడియోతో అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా ‘అల.. వైకుంఠపురం’లోని బుట్ట బొమ్మ పాటకు డాన్స్ చేశాడు. తన సతీమణి క్యాండీస్ తో కలిసి అద్భుతమైన స్టెప్పులతో చిందులేశాడు. వీళ్లు డాన్స్ చేస్తున్న సమయంలో వార్నర్ కూతురు ఇండి కూడా వెనకాల తనకు వచ్చిన స్టెప్పులతో ఆకట్టుకుంది. ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే ఇక్కడ మరో విశేమేమిటంటే డాన్స్ చేస్తున్న సమయంలో వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీ షర్ట్ ధరించడం.