సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ మరింతగా బలపడేందుకు ప్లాన్ చేస్తోంది. అందుకు అనుగుణంగా కమిటీలను నియమిస్తోంది. సమర్థవంతమైన నేతలకు బాధ్యతలు అప్పగిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆదివారం పూర్తి కమిటీని ప్రకటించారు. జి.విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బండారు శోభారాణి, సంకినేని వెంకటేశ్వరరావు, ఎండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణిని ఉపాధ్యక్షులుగా నియమించారు. అలాగే ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి ప్రధాన కార్యదర్శులుగా నియమితుయ్యారు. రఘునందన్ రావు, కుంజా సత్యవతి, పల్లె గంగారెడ్డి, డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్‌గౌడ్, బొమ్మ జయశ్రీ, కె.మాధవి, జి.ఉమారాణి తదితరులకు కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. బండారి శాంతి కుమార్, భావరిలాల్వర్మ కోశాధికారులుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. నూతన కార్యవర్గంలో సీనియర్ నేతలతో పాటు కొత్తవారికి కూడా అవకాశం కల్పించారు.
- August 2, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- BANDI SANJAY
- BJP
- STATE COMMITEE
- TELANGANA
- తెలంగాణ
- బండి సంజయ్
- బీజేపీ
- Comments Off on బీజేపీ స్టేట్ కమిటీ నియామకం