Breaking News

బిగ్​బాస్​ హౌస్​లోకి హాట్​భామ

తొలుత కొంత చప్పగా సాగిన బిగ్​బాస్​ హౌస్​ ఈ మధ్య ఊపందుకున్నది. బిగ్​బాస్​ ఇస్తున్న వైవిధ్యభరితమైన టాస్కులతో ప్రేక్షకుల్లోనూ కొంత ఆసక్తి పెరిగింది. అయితే హౌస్​ లో వినోదం కాస్త తగ్గడంతో ఇప్పటికే ముక్కు అవినాశ్​, కుమార్​ సాయి అనే ఇద్దరు కమెడీయన్లను దించారు. అవినాశ్​ కాస్త బాగానే వినోదం పండిస్తున్నా.. కుమార్​సాయి మాత్రం ఆశించిన స్థాయిలో పర్​ఫామెన్స్​ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో మరో హాట్​ హీరోయిన్​ వైల్డ్​ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్​లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. జంప్ జిలానీ సినిమా హీరోయిన్‌ స్వాతి దీక్షిత్ ఇవాలో రేపో.. బిగ్ బాస్-4వ సీజన్ లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే హౌస్​లో ఉన్న హీరోయిన్​ మొనాల్​తో ఇద్దరు కంటెంటెస్టులో లవ్​లో పడ్డారు. వారి ప్రేమాయణం జోరుగా సాగుతున్నది. ఈ క్రమంలో ఈ హాట్​ హీరోయిన్​ ఎంట్రీ ఇస్తే హౌస్​లోని కుర్రాళ్లు మరింత రెచ్చిపోతారేమో వేచిచూడాలి.