Breaking News

బాలూ వ్యక్తిత్వం శిఖరాయమానం! అందుకు ఈ లేఖే సాక్ష్యం

ఇటీవలే మనందరనీ విడిచిపెట్టి వెళ్లిపోయిన ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఎంతటి నిరాడంబరుడో అంతటి మర్యాదస్తుడు. ఎంతటి సంస్కార వంతుడో అంత ప్రతిభాశాలి. ఎంతమంది కొత్త కళాకారులను ప్రోత్సహించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో పాడుతున్న చాలా మంది సింగర్స్​ ఆయన ప్రోద్బలంతో వచ్చినవారే. నిజానికి ఆయన ప్రతిభ అసమానం.

కేంద్రప్రభుత్వం ఆయనకు 2001 లో పద్మశ్రీ ని, 2011 లో పద్మ భూషణ్ ని ప్రకటించింది. అంతేకాక ఆయన ఆరు సార్లు జాతీయ స్థాయి లో ఉత్తమ గాయకుడిగా అవార్డును అందుకున్నారు. ఇంత గొప్పవ్యక్తి తెలుగువాడు అని చెప్పుకోవడం మనందరికీ గర్వకారణం.

అయితే ‘నా పేరు మందు డాక్టర్​ ఏది.. కళా ప్రపూర్ణ ఏది.. ఉండాల్సినే విశేషణాలు ఏమయ్యాయి’ అంటూ ఎందరో నటులు, డైరెక్టర్లు, నిర్మాతలు నిర్వాహకుల మీద మండిపడటం మనం చూస్తుంటాం. కానీ బాలు మాత్రం అటువంటి వాటికి భిన్నం. ఆయన పేరుముందు విశేషణాలు ఉంటే ఆయన చిరాకు పడతారు. బాలూ అని ముద్దుగా పిలిపించుకోవడమే ఆయనకు ఇష్టం. ఇటీవల బాలూ రాసిన ఓ లేఖ సోషల్​మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ లెటర్ లో బాలూ ఏంరాశారంటే.. ‘ శ్రీ ప్రకాశ్​ గారికి, విజయదశమి శుభాకాంక్షలు. నవంబర్ 30న మీ కార్యక్రమంలో తప్పక పాల్గొనగలను. కొన్ని చిన్నచిన్న అభ్యర్థనలను మన్నించక తప్పదు. దయచేసి నా పేరు ముందు ‘డాక్టర్’, ‘పద్మభూషణ్’, ‘గాన గంధర్వ’ లాంటి విశేషణలు వేయకండి. మనకు ఇంకా వ్యవధి ఉంది కాబట్టి ప్రయాణ వివరాలు తర్వాత తెలుపగలరు” అని రాసి ఉంది. బాలు నిరాడంబర వ్యక్తిత్వానికి అద్దం పడుతున్న ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్నది.

సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న బాలసుబ్రహ్మణ్యం రాసిన లేఖ