సారథిన్యూస్, హైదరాబాద్: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. ఎస్పీ బాలు కరోనాతో చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని యావత్ దేశం ప్రార్థిస్తోంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక, క్రీడా ప్రముఖులు కూడా బాలు ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా ఎస్పీ బాలు కోలుకోవాలని ట్వీట్ చేశారు. మరోవైపు చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ కూడా ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిలుకూరి బాలాజీ కృపతో ఆయన త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ఆయన పేర్కొన్నారు.
- August 20, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- CHENNAI
- HARISHRAO
- HEALTH
- MINISTER
- SINGER
- SP BALU
- ఆరోగ్యం
- ఎస్పీబాలు
- మంత్రి హరీశ్‌రావు
- Comments Off on బాలు త్వరగా కోలుకోవాలి