బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి
సారథి న్యూస్, హైదరాబాద్: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. ఆయన మృతితో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాధం నెలకొంది. యావత్ చిత్ర పరిశ్రమ శోకసముద్రంలో మునిగింది.
‘సలామ్ బాంబే’ సినిమాతో పరిచయమైన ఇర్ఫాన్ ఖాన్ పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన ‘సైనికుడు’ సినిమాలో ఆయన కూడా పాత్ర పోషించాడు. ఈ మధ్యలో ‘అంగ్రేజీ మీడియం’ సినిమాలో నటించగా లాక్ డౌన్ రెండు రోజులు ముందే రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.