Breaking News

ఫేక్​ అకౌంట్స్​తో గాలమేస్తారు.. జాగ్రత్త!

సారథి న్యూస్, రామడుగు: అందమైన అమ్మాయిల ఫొటోలు, ఆకర్షణీయమైన ప్రొఫైల్​ పిక్స్​తో కొందరు ఫేస్​బక్​లో ఫ్రెండ్ రిక్వెస్ట్​ పంపిస్తుంటారు. మరికొందరేమో పోలీస్​ అధికారులు, సెలబ్రిటీల పేరుతో ఫేక్​ ఐడీలు క్రియేట్​ చేసుకుంటారు. అటువంటి వారికి మనం ఫ్రెండ్​ రిక్వెస్ట్​లు పంపినా.. మనకు వచ్చిన రిక్వెస్టులను యాక్సెప్ట్​ చేసినా చిక్కుల పడడం ఖాయమని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ విషయంపై శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు ఎస్సై అనూష మాట్లాడుతూ.. పోలీస్​ అధికారి పేరుతో ఫేస్​బుక్​లో చాలా తప్పడు ఐడీలు ఉంటాయని అటువంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. అపరిచిత వ్యక్తలు డబ్బులు అడుగితే పంపించవద్దని సూచించారు.