టాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నయనతార. ఆమె కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నష్ శివన్ తో ప్రేమలో ఉన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అది నిజమో కాదో తెలీదు కానీ..అవేమీ పట్టించుకోకుండా ఈ జంట ఓనమ్ కి సొంత ఊరు కొచ్చి కి వెళ్లారు. అక్కడ పండుగ జరుపుకొని కుటుంబంతో గోవా వెళ్లారు. అక్కడ అందరూ కలిసి నయన్ మదర్ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. కేక్ కటింగ్ చేస్తున్న ఫోటోలను కొన్ని విఘ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘‘నా ప్రియమైన అమ్మూ శ్రీమతి కురియన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీ అమ్మాగారి ముఖం పై ఉండే ఆ చిరునవ్వు నీ (నయన్) ఆనందాన్ని కూడా పెంచుతుంది.. తల్లిదండ్రులను జీవితాంతం సంతోషంగా ఉంచడమే ఆదర్శవంతమైన జీవిత లక్ష్యం అనిపించుకుంటుంది..”అంటూ ఆమెకి విషెస్ చెబుతూ నయన్ ఆనందంలో తనూ పాలుపంచుకున్నాడు విఘ్నేష్. ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రం దగ్గర్నుంచి విఘ్నేష్ శివన్- నయనతారల ప్రేమ చిగురించింది. అప్పటినుంచి ఒకరంటే ఒకరుగా విడిపోని జంటగా కలిశారు. వీళ్ల పెళ్లి వేడుకలు ఎప్పుడు అంటూ ఫ్యాన్సంతా ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు
- September 15, 2020
- Archive
- Top News
- సినిమా
- AP
- ENJOY
- GOA
- HYDERABAD
- LOVE
- NAYANATARA
- ROMANCE
- TRIP
- గోవా
- తమిళనాడు
- తెలంగాణ
- నయనతార
- విఘ్నేశ్శివన్
- హైదరాబాద్
- Comments Off on ప్రియుడితోకలిసి గోవాకు నయన్..