సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తున్నది. రాజకీయ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. తాజాగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే హోం మంత్రి మహమూద్ అలీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌కు కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ గొంగిడి సునీతా రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యం నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సునీత చికిత్స పొందుతున్నారు. ఆమె భర్త, నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డికి కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. ఫలితం రావాల్సి ఉన్నది. రాష్ట్రంలో సకాలంలో టెస్టులు చేయకపోవడం వల్లే కరోనా భారీగా వ్యాపించిందని వైద్యనిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో గల్లీ, గల్లీలో కరోనా రోగులు ఉన్నారు. దీంతో ప్రజలు భయంతో హడలిపోతున్నారు. ఎవరితో మాట్లాడాలన్నా జంకుతున్నారు. తోటి స్నేహితులను, సన్నిహితులను, బంధువులను చివరకు ఇంట్లో వారిని కూడా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి దాపురించింది.
- July 4, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- HOMEMINISTER
- HYDERABAD
- MLA
- SUNITHA
- TELANGANA
- సునీతారెడ్డి
- Comments Off on ప్రభుత్వ విప్ గొంగిడి సునితకు కరోనా