సారథిన్యూస్, రామడుగు: నిర్వాసితులకు పరిహారం ఇప్పించడంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విఫలమయ్యారని టీడీపీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి ఆరోపించారు. నారాయణపూర్ రిజర్వాయర్ కోసం ఎందరో పేదలు ఇండ్లు, భూములు కోల్పోయారని ఎమ్మెల్యే రవిశంకర్ కనీసం వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బుధవారం జోజిరెడ్డి నేతృత్వంలోని టీడీపీ బృందం గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించి.. బాధిత కుటుంబాలను పరామర్శించింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జంగం అంజయ్య, గంగాధర మండల పార్టీ అధ్యక్షుడు మల్కాపురం రాజేశం, మీడియా సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, పార్టీ నాయకులు కమలాపురం శ్రీపతిరావు, దొంతుల వేణుగోపాల్, కొప్పుల రాజేశం పరుశరాములు, శంకరయ్య,వైద భూపతి తదితరులు పాల్గొన్నారు.
- August 18, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- HYDERABAD
- KARIMNAGAR
- MLA
- PROJECT
- RAVISHANKAR
- TDP
- TELANGANA
- Comments Off on నిర్వాసితులంటే ఇంత నిర్లక్ష్యమా!