హీరో నితిన్ పెళ్లి డేట్ ఖరారయినట్టు సమాచారం. ఏప్రిల్ 16న నితిని పెళ్లి జరుగాల్సి ఉండగా లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. నాగర్‌కర్నూల్‌కు చెందిన వైద్యురాలు నూర్జహాన్ కుమార్తె కందూకూరి శాలినితో నితిన్ వివాహం నిశ్చయమైన సంగతి తెలిందే. శాలినీ లండన్‌లో విద్యనభ్యసిస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నట్టు సమాచారం. ఇరుకుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించారు. కరోనాతో పెళ్లి వాయిదా పడింది. డిసెంబర్లో జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఇరు కుటుంబాల పెద్దలు జూలై 26న నిర్వహించడానికి నిర్ణయించుకున్నారని టాక్. హైదరాబాద్ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో నిరాడంభరంగా వీరి పెళ్లి జరుగునున్నట్టు సమాచారం.
- July 1, 2020
- Archive
- Top News
- సినిమా
- MARRIGE
- NAGARKURNOOL
- NITHIN
- SHALINI
- నితిన్
- పెళ్లి
- ఫామ్‌హౌస్
- హైదరాబాద్
- Comments Off on నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్!