సారథిమీడియా, శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట పోలీస్‌స్టేషన్ రణరంగంగా మారింది. వైసీపీ, టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. శనివారం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ను అరెస్ట్ చేయాలని టీడీపీ శ్రేణులు నరసన్న పేట పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ధర్మానకు మద్దతుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు నచ్చజెప్పారు. కార్యక్రమంలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మెహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్, టీడీపీ నేతలు కిమిడి కళావెంకట రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- October 3, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- ANDHRAPRADESH
- HYDERABAD
- TELANGANA
- YCP
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- Comments Off on నరసన్నపేటలో టీడీపీ, వైఎస్సార్సీపీ ఘర్షణ