Breaking News

నజీర్​ కు బుర్ర లేదు: అక్తర్

నజీర్​ కు బుర్ర లేదు: అక్తర్

కరాచీ: టీమిండియా డాషింగ్ మాజీ ప్లేయర్ సెహ్వాగ్‌ కంటే  టాలెంటెడ్‌ అయినప్పటికీ తమ ప్లేయర్ ఇమ్రాన్ నజీర్‌కు బుర్ర లేదని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఇంటర్​నేషనల్ క్రికెట్‌లో మంచి ఆరంభం దక్కించుకున్న నజీర్.. చేతులారా తన సక్సెస్​ ను పాడుచేసుకున్నాడని అన్నాడు. దీనికితోడు పీసీబీ కూడా అతనికి సరైన అవకాశాలు ఇవ్వలేదని ఆరోపించాడు.

‘ఇమ్రాన్‌ ను తీర్చిదిద్దితే సెహ్వాగ్​ కంటే నాణ్యమైన, మెరుగైన ప్లేయర్ అయ్యేవాడు. ఇండియాతో ఓ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. దీంతో అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని బోర్డును కోరా.. కానీ మా దగ్గరు ఉన్న వనరులను ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం మా దురదృష్టకరం.

అలా ఉపయోగించుకుంటే నజీర్ రూపంలో మాకు సెహ్వాగ్ కంటే బెటర్ ప్లేయర్ ఉండేవాడు. అతను అన్నిరకాల షాట్లు ఆడేవాడు. మంచి ఫీల్డర్ కూడా.. అతని మేం చక్కగా సద్వినియోగం చేసుకోవ్సాలింది. కానీ, అలా జరగలేదు’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు.