సారథిన్యూస్, హైదరాబాద్: మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కరోనా లక్షణాలతో కొంతకాలం క్రితం నిమ్స్‌లో చేరారు. తాజాగా ఆయనకు నెగిటివ్ వచ్చింది. దాంతో… కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే నంది ఎల్లయ్యకు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇతర అనారోగ్యసమస్యలతోనే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. ఎల్లయ్య మృతితో రాంనగర్‌లోని ఆయన నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. నంది ఎల్లయ్య మృతిపై సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. నంది ఎల్లయ్య ఐదుసార్లు లోక్‌సభ, రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 2014లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన రాజకీయంగా ఆయన ఎన్నో ఆటుపోట్లు చూశారు. అన్ని సమయాల్లో పార్టీకి అండగా నిలిచారు. ప్రస్తుతం ఆయన భౌతికఖాయం నిమ్స్ ఆస్పత్రిలో ఉన్నది. అంత్యక్రియలు ఎక్కడ జరిపిస్తారన్నది తేలాల్సి ఉంది.
- August 8, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CONGRESS
- KCR
- MP
- NIMS
- PASSESAWAY
- TELANGANA
- YELLAIAH
- నంది ఎల్లయ్య
- నిమ్స్
- Comments Off on నంది ఎల్లయ్య కన్నుమూత