Breaking News

‘ధరణి’ పూర్తిగా పారదర్శకం

‘ధరణి’ పూర్తిగా పారదర్శకం

  • ఒక క్లిక్​తో భూముల వివరాలను ఎక్కడైనా చూసుకోవచ్చు
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తి
  • సబ్ రిజిస్ట్రార్ ​ఆఫీసులుగా తహసీల్దార్ కార్యాలయాలు
  • పాత రిజిస్ట్రేషన్ చార్జీలే వర్తిస్తాయి..
  • ‘ధరణి’ పోర్టల్ ​ప్రారంభంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఎంతో శ్రమించి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పూర్తి పారదర్శకంగా ఉంటుందని, 1,45,58,000 ఎకరాల భూములు ఇందులో దర్శనమిస్తున్నాయని సీఎం కె.చంద్రశేఖరావు అన్నారు. భూముల వివరాలను దేశవిదేశాల్లో ఉన్న వారు ఎవరైనా చూసుకోవచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులు ఒక్క క్లిక్​తో తెలుసుకోవచ్చన్నారు. గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చింతలపల్లిలో ధరణి పోర్టల్ ను ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ ​ప్రసంగించారు. ‘ప్రజల బతుకంతా భూమి చుట్టూ ఉండేది ఒకప్పుడు భూమికి ప్రాధాన్యత ఉండేది కాదు కానీ క్రమపద్ధతిలో నిర్మాత పద్ధతిలో వ్యవసాయం చేయడం నేర్చుకున్న తరువాత భూమికి విలువ పెరిగింది. గత పాలకులు రెవెన్యూ చట్టాలు భూ విధానాలకు శ్రీకారం చుట్టారు. కొన్ని ఫలితాలు ఇచ్చాయి.. కొన్ని వికటించాయి. కొన్ని ప్రజలకు లాభం కలిగించాయి.. ఇబ్బందులు కలిగించాయి. వాటినన్నింటికి శాశ్వత విచారణ కావాలని తెలంగాణ రైతన్న ఎప్పటి ఆటుపోట్లకు గురికావద్దని ఉద్దేశంతోనే కొత్త రెవెన్యూ చట్టం కోసం నిర్ణయం తీసుకున్నాం. ఒక తప్పు జరిగితే అనేక తరాలు ఇబ్బందులు పడతాయి. తప్పటడుగులు లేకుండా సరైన పథంలో ముందుకెళ్లాలని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం..’ అని సీఎం కేసీఆర్ ​అన్నారు.

హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు

వీఆర్వోలతో చెడ్డపేరు
వీఆర్వోల వల్ల రెవెన్యూ వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందని సీఎం కేసీఆర్​చెప్పాను. అందులో భాగంగానే రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉద్యోగులు సహకరించాలని సూచించారు. ఒక పెద్ద విప్లవం, సంస్కరణ వచ్చినప్పుడు బాలారిష్టాలు ఉంటాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇకనుంచి భూములను గోల్ మాల్ చేసే ఆస్కారం లేదన్నారు. దేవాదాయ, వక్ఫ్ భూములు, ఫారెస్ట్ భూములను ఎవరికి పడితే వారికి రిజిస్ట్రేషన్​ చేసేందుకు ఆస్కారం ఉండదన్నారు. అన్ని భూముల వివరాలు ఆటో లాక్ లో ఉంటాయి. తహసీల్దార్, కలెక్టర్ ఓపెన్ చేద్దామన్నా అవి ఓపెన్ కావు.. అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 570 తహసీల్దార్ ఆఫీసులు అన్ని సబ్ రిజిస్ట్రార్​ ఆఫీసులుగా మారాయని సీఎం కేసీఆర్​వివరించారు. అధికారుల చుట్టూ తిరిగే వాళ్లు కార్యాలయం చుట్టూ తిరిగే కర్మ ఇకపై ఉండదన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం పైరవీలు చేసే అవకాశం ఉండదన్నారు. రైతులకు ఇష్టమున్న రోజు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు.
పాత రిజిస్ట్రేషన్ చార్జీలే
పాత రిజిస్ట్రేషన్ చార్జీలే వర్తిస్తాయని సీఎం కేసీఆర్​స్పష్టంచేశారు. ఈ పోర్టల్ లో అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు ఉండదన్నారు. రిజిస్ట్రేషన్ ల కోసం పైరవీలు చేసే అవసరం ఉండదన్నారు. క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాల్లో పూర్తవుతుందన్నారు. డాక్యుమెంట్ రైటర్ సహాయం కూడా తీసుకోవచ్చన్నారు. వాళ్లు తీసుకోవాల్సిన రుసుము కూడా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. డాక్యుమెంట్ రైటర్ల పేర్లను జిల్లా కలెక్టర్లు ప్రకటిస్తారని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చన్నారు. సంక్షేమంలో దేశానికి మార్గదర్శకంగా నిలిచామని చెప్పారు. ఏటా ఎఫ్ సీఐకి భారతదేశం మొత్తం 45శాతం ధాన్యం తెస్తే తెలంగాణ రాష్ట్రం 55 శాతం ధాన్యం ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ ​రంజన్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ధరణి పోర్టల్​ ప్రారంభోత్సవానికి హాజరైన రైతులు, మహిళలు, ప్రజాప్రతినిధులు