సారథి న్యూస్, రామాయంపేట: గ్రామాల్లో జరిగే ఉత్సవాల్లో దున్నపోతులను అమ్మవారికి బలివ్వడం చట్టరిత్యా నేరమని నిజాంపేట వెటర్నరీ అధికారి సుధాకర్ దేశ్ ముఖ్ హెచ్చరించారు. గురువారం ఆయన మెదక్ జిల్లా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో కరోనా విస్తరిస్తున్నదని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చల్మెడ గ్రామంలో కరోనా మహమ్మారిని పోవాలంటే అమ్మవారికి దున్నపోతులు బలివ్వాలని గ్రామస్థులు నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో ఇంటికి రూ. 1000 వసులూ చేస్తున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు వెల్పేర్ బోర్డ్ ఆఫ్ యానిమల్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రాష్ట్ర పశుసంవర్థకశాఖకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెటర్నరీ అధికారి గ్రామంలో పర్యటించారు.
- October 1, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- HYDERABAD
- KCR
- KTR
- RAMAYAMPET
- TELANGANA
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on దున్నపోతుల బలి నేరం