సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని 9 క్లస్టర్ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణ పనులు దసరా పండుగ నాటికి పూర్తిచేయాలని ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ సంబంధిత కాంట్రాక్టర్లకు ఆదేశించారు. మండల కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న రైతువేదికను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీచేసి మాట్లాడారు. రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలను త్వరితగతిన పూర్తిచేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అలాగే నిర్మాణం విషయంలో ప్రభుత్వం పేర్కొన్న కంపెనీ మెటీరియల్ ను వినియోగించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో టఆర్ఎస్ మండలాధ్యక్షుడు కురుమయ్య, పులేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
- October 17, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- BIJINEPALLY
- NAGARKURNOOL
- RYTHUVEDIKA
- TELANGANA
- TRS
- టీఆర్ఎస్
- తెలంగాణ
- నాగర్కర్నూల్
- బిజినేపల్లి
- రైతు వేదికలు
- Comments Off on దసరా నాటికి రైతు వేదికలు కంప్లీట్ కావాలె