సారథి న్యూస్, హైదరాబాద్: ఓ దళిత యువతపై ఏండ్ల తరబడి 143 మంది లైంగికదాడికి పాల్పడ్డారు. దేశంలోని పలుప్రాంతాలకు ఆమెను తిప్పి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారం జరిపిన వాళ్లలో విద్యార్థినాయకులు, రాజకీయనాయకుల పీఏలు, పలువురు టీవీ, సినీ రంగానికి చెందినవారు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ కేసును హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్క హైదరాబాద్ నగరమే కాదు.. యావత్ తెలంగాణ సమాజమే ఉలిక్కిపడింది. ప్రస్తుతం 143 మందిపై కేసు నమోదైనట్టు సమాచారం. నల్గొండ జిల్లా వేములపల్లి మండలానికి చెందిన దళిత యువతికి మిర్యాలగూడ నివాసితో 2009 జూన్‌లో వివాహమైంది. అత్తింటి వారి వేధింపులు తాళ లేక 2010 డిసెంబర్‌లో విడాకులు తీసుకొంది. తల్లిదండ్రుల వద్దే ఉంటూ చదువు కునేది. ఈ క్రమంలో ఆ యువతికి విద్యార్థి సంఘం నాయకులతో పరిచయమైంది. కళాశాలలో పరిచయమైన ఓ విద్యార్థిసంఘం నాయకుడు యువతిపై మొదట లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించాడు. తర్వాత ఆమెపై విద్యార్థిసంఘం నాయకుడు, అతడి స్నేహితులతోపాటు, పలువురు రాజకీయనాయకులు, సినీ , టీవీ ప్రముఖలు లైంగికదాడికి పాల్పడ్డారు. సదురు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని కొన్ని అంశాలు.. ‘గత 11 ఏళ్లలో నాపై 143 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారు. నగ్నంగా చిత్రాలు, వీడియోలు తీశారు. సిగరెట్లతో కాలుస్తూ శారీరకంగా హింసించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని తుపాకీతో బెదిరిం చారు. నాపై అత్యాచారానికి పాల్పడిన వారిలో విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకుల పీఏలు, సినీ నటులు, టీవీ యాంకర్లు ఉన్నారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది’ అంటూ పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ యువతి తన భయాందోళనను వ్యక్తం చేసింది. బాధిత యువతి మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి తెలిపారు. కాగా ఇన్నేండ్లుగా మౌనంగా ఉన్న బాధితురాలు.. ఇప్పడే పోలీసులను ఎందుకు ఆశ్రయించిందన్న అంశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- August 22, 2020
- Archive
- Top News
- క్రైమ్
- CRIME
- HYDERABAD
- NALGONDA
- PANJA GUTTA
- POLICE
- RAPE
- నల్లగొండ
- పోలీసులు
- లైంగికదాడి
- హైదరాబాద్
- Comments Off on దళిత యువతిపై 143 మంది లైంగికదాడి