సారథి న్యూస్, పెద్దశంకరంపేట: దళిత ఎమ్మెల్యేలపై బీజేపీ గుండాల దాడి హేయమైనచర్య అని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్), ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేపై దాడిచేసిన దుండగుల దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్యం మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా సిద్దిపేటలోని స్వర్ణ ప్యాలేస్ హోటల్ లో ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్చేశారు. కార్యక్రమంలో డీబీహెచ్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంగమేశ్వర్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు తుకారాం, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కోటారి నర్సింహులు, ఎమ్మార్పీఎస్, టీఎమ్మార్పీఎస్ సంఘాల బాధ్యులు దుర్గయ్య, సాయిలు, మాణిక్యం, విజయ్ బూరుగుపల్లి, ఎస్.గణపతి, సాయిలు పాల్గొన్నారు.
- November 3, 2020
- Archive
- Top News
- మెదక్
- BJP
- DUBBAKA
- KVPS
- medak
- PEDDASHANKARAMPET
- SIDDIPETA
- డీబీహెచ్ఎస్
- దుబ్బాక
- పెద్దశంకరంపేట
- బీజేపీ
- మెదక్
- సిద్దిపేట
- Comments Off on దళిత ఎమ్మెల్యేలపై దాడి హేయం