సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ర్టంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, జలవనరులు నీటిమయమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అధికారులు ఐదువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ములుగు జిల్లాలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 9.90 మీటర్లకు చేరింది. నదికి సమీపంలోని ఏటూరునాగరం గ్రామంలోని లోతట్టు ప్రాంతాల నుంచి అధికారులు దాదాపు వెయ్యి మందిని తరలించారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి మూడువేల మందికి పైగా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లారు.
భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతుండడంతో గోదావరిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. మరోవైపు గోదావరి ప్రవాహం రాత్రి 10 గంటల వరకు ప్రమాదకర స్థాయిని దాటవచ్చని సీడబ్ల్యూసీ హెచ్చరికలు జారీచేసింది.
- August 16, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- HEAVYRAINS
- HYDERABAD
- MULUGU
- PUSHKARAGHAT
- TELANGANA
- WARANGAL
- తెలంగాణ
- భారీవర్షాలు
- వరంగల్
- హైదరాబాద్
- Comments Off on దంచికొడుతున్న వానలు