Breaking News

తెలంగాణ‌లో డేంజర్​ బెల్స్​

సారథిన్యూస్​, హైదరాబాద్: తెలంగాణ‌లో క‌రోనావైర‌స్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి స్టేజ్ 3కి చేరుకుంద‌ని, క‌మ్యూనిటీ స్ప్రేడ్ అవుతుంద‌ని సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు. వ‌చ్చే నాలుగు-ఐదు వారాలు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ప్ర‌జ‌లంతా మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఇక‌, రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి న‌గ‌రాల్లో కూడా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయ‌న్న శ్రీ‌నివాస‌రావు ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం అన్నారు. ల‌క్ష‌ణాలు లేనివారు క‌రోనా టెస్ట్‌ల కోసం రావొద్ద‌ని ల‌క్ష‌ణాలున్న ప్ర‌తీ ఒక్క‌రూ టెస్ట్‌లు చేయించుకోవాల‌ని సూచించారు. జిల్లాల్లో సైతం పీహెచ్‌సీల్లో క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. క‌రోనా ల‌క్ష‌ణాలున్నవారు ఆల‌స్యం చేస్తే ప్రాణానికే ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రించారు. కరోనా విషయంలో వీలైనంత త్వ‌ర‌గా చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు అని వెల్ల‌డించారు. క‌రోనాబారిన మందులతో కోలుకోవచ్చని చెప్పారు. కరోనా ట్రీట్‌మెంట్‌కు లక్షల రూపాయల వైద్యం అవసరం లేద‌న్నారు. కరోనా నియంత్రణకు తెలంగాణ రాష్ట్రం రూ.100 కోట్లు కేటాయించింద‌ని చెప్పారు. వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామ‌ని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ప‌రిస్థితులు బెటర్‌గా ఉన్నాయ‌ని, కరోనాబారిన‌ప‌డిన‌వాళ్ల‌లో 99 శాతానికి పైగా రికవరీ అవుతున్నార‌ని వెల్ల‌డించారు. ఇక‌, 70 శాతం మంది క‌రోనా రోగులు హోం ఐసోలేష‌న్‌లోనే ఉన్నారన్నారు. ప్రతీ రోజూ 15 వేల టెస్టులు చేస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వెళ్లి, ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌ద్ద‌ని కీల‌క సూచ‌న‌లు చేశారు. కేసుల సంఖ్య పెరగటంతో పాటు.. రిక‌వ‌రీ అయ్యేవారి సంఖ్య కూడా పెరిగింద‌ని.. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.