సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం 894 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 92,255 కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా బారినపడి 703 మంది చనిపోయారు. చికిత్స అనంతరం 2,006 మంది ఆస్పత్రి నుంచి క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 70,132 కు చేరింది. 24 గంటల్లో 8,794 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,420 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 76.01శాతంగా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,53,349 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 147 పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్10, భద్రాద్రి కొత్తగూడెం 9, జగిత్యాల 31, జోగుళాంబ గద్వాల 21, కరీంనగర్ 69, ఖమ్మం 44, కొమరంభీం ఆసిఫాబాద్11, మహబూబ్నగర్ 30, మహబూబాబాద్31, మంచిర్యాల 17, మాల్కాజిగిరి 51, నాగర్కర్నూల్15, నల్లగొండ 37, నిజామాబాద్38, పెద్దపల్లి 62, రంగారెడ్డి 85, సంగారెడ్డి 29, సిద్దిపేట 58, సూర్యాపేట 12, వరంగల్అర్బన్44 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది.